Monday, September 15, 2008

Chitkaalu

ఈరోజు అందానికి చిట్కా చెప్తాను
కొంచెం టొమాటో రసం, నిమ్మరసం, గ్లిసరిన్ అన్నీ సమానంగా తీసుకుని బాగా కలిపి ముఖానికి సున్నితంగా మర్ధనా చేసి పది నిముషాల తర్వాత చల్లని నీళ్ళతో కడిగేస్తే ముఖం తాజాగా ఉండి, మీ అలసట అంతా మాయమవుతుంది.
ఇప్పుడు ఆరొగ్యానికి సంబంధించిన చిన్న చిట్కా:
పన్ను నొప్పి బాగా బాధిస్తొందా, అయితే నొప్పి వున్న పన్ను మీద లవంగాల పొడి పెట్టిచూడండి, నొప్పి మాయమయిపోతుంది.

Sunday, August 31, 2008

నమస్తే,

చాలా రోజుల తర్వాత కలుస్తున్నాను. మేము మొన్న తిరుపతి వెళ్ళాము. దర్శనం బాగా జరిగింది. చిరంజీవి గారి
పార్టీ ఆవిష్కరణ టివి లో చూశాను. ప్రజారాజ్యం పేరు సామాన్య మానవుడిని ఆకర్షించేలా ఉంది.
ఇకపోతే ఈవాల్టి చిట్కా చెపుతాను.
కొత్తగా మనం వంటలు చేసేటపుడు మనకు దేంట్లో చింతపండు వేయాలో, దేంట్లో మిరప్పొడి వేయాలో అర్ధం కాదు. దీనికి ఒక చిట్కా చెప్తాను.
చింతపండు వేసే కూరల్లో ఎండుమిర్చి, నిమ్మకాయ వేసే కూరల్లో పచ్చిమిర్చి వాడితే కూర బాగుంటుంది.
ఇప్పుడు మార్కెట్లో వైట్ టీ దొరుకుతొంది, దీనితో టీ చేసుకుని తాగితే పంటి నొప్పి తగ్గుతుంది.
ఈ వైట్ టీని తేయాకు చెట్టు పుష్పించేముందు ఆ పూమొగ్గలు మరియు లేత ఆకులతో తయారుచేస్తారు. ఇది అరుదుగా దొరుకుతుంది మరియు వెల ఎక్కువ గా ఉంటుంది.

Sunday, August 10, 2008

tips

ఈవేళ కొన్ని ఆరోగ్యానికి సంబధించిన చిట్కాలు చెప్తాను.ఉదయాన్నే నాలుగు లేదా ఐదు ఖర్జూరాలు తిని, ఒక గ్లాసు గొరువెచ్చని నీళ్ళు తాగితే జలుబు దగ్గు నుంచి ఉపశమనం కలుగుతుంది.

తమలపాకు లో కొంచెం దాల్చినచెక్క ముక్క పెట్టుకుని నిదానంగా నములుతూ ఉంటే పొడిదగ్గు కంట్రోల్ లో ఉంటుంది, 1/2 తమలపాకు లో కొంచెం దాల్చిని ముక్క పెట్టుకుని అలా రోజుకి నాలుగు లేదా ఐదు సార్లు తినాలి.

Thursday, August 7, 2008

చిట్కాలు

ఈరోజు అందానికి కొన్ని చిట్కాలు చెప్తాను
ఈ వర్షాకాలంలో పాదాలు బాగా పగుల్తాయి. దానికి మందులకన్నా ఇంట్లో చేసుకునే చిట్కాలు ఇవీ
మొదటగా రాత్రి పూట పడుకోబొయే ముందు పాదాలను బాగా కడగాలి, తర్వాత మెత్తటి వస్త్రం తో తుడిచి నువ్వులనూనె లో కొంచెం పసుపు కలిపి పాదాలకు బాగా సున్నితంగా రుద్దుతూ పూయాలి, ఇలా కొద్ది రోజులు పూస్తే పగుళ్ళు పూర్తిగా తగ్గుతాయి, పైగా ఇది పూర్తిగా సహజమైనది కాబట్టి శరీరానికి చాలా మంచిది.
ఇలాగే కొబ్బరినూనె లో పసుపు రాసి పాదాలకు రాత్రి పూట రాస్తే పాదాలు మ్రుదువుగా తయారవుతాయి.

Sunday, August 3, 2008

tips

వెండి వస్తువులను మెత్తటి కాటన్ లేదా సాటిన్ వస్త్రం లో చుట్టి ఉంచాలి అప్పుడు వాటి మెరుగు పోకుండా ఉంటుంది.
రాగి, ఇత్తడి పాత్రలను శుభ్రం చేసేటప్పుడు క్లేనింగ్ పౌడర్ కు కొంచం నిమ్మవుప్పు లేదా నిమ్మరసం కలిపి రుద్ది కడిగితే తళతళలాడతూవుంటాయి.
పట్టు, జరీ చీరలని వుతికే నీటిలొ కొంచం నిమ్మరసం కలిపినట్లయితే చీరలు రంగు మారకుండవుంటాయి.
నాకు తెలిసిన విషయాలు చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. ఎవరికైనా వుపయొగపడితే చాలామంచిది.

Thursday, July 31, 2008

tips

I want to share some tips for all types like beauty, healthy and cleaning purposes. I am collecting from weeklies, dialy paper and other places, which are useful for software professionals and very busy people who doesnot have free time. I will come soon with the tips small small chitkaalu.

Tuesday, July 29, 2008

Namaste. After a long time Iam coming to blog. I will try to come regularly